ETV Bharat / state

మనలా ఎవరూ స్పందించలేదు: సీఎం జగన్

author img

By

Published : May 18, 2020, 1:31 PM IST

Updated : May 18, 2020, 3:37 PM IST

ఎల్జీ పాలిమర్స్‌ ఘటన చాలా బాధాకరమని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. ఘటన జరిగిన వెంటనే స్పందించామని గుర్తు చేశారు. మృతుల కుటుంబాల్లో అర్హత ఉన్నవారికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని సీఎం చెప్పారు. బాధిత గ్రామాల ప్రజలకు పరిహారాన్ని జగన్ విడుదల చేశారు.

cm jagan on lg polymers gas leakage
cm jagan on lg polymers gas leakage

గ్యాస్ లీకేజ్ లాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నది ఆలోచించామని ముఖ్యమంత్రి జగన్ చెప్పారు. ఘటన జరిగిన వెంటనే అధికారులు బాగా స్పందించారని ప్రశంసించారు. గతంలో ఓఎన్జీసీ ఘటనలో పరిహారంపై తానూ ప్రశ్నించానని గుర్తు చేశారు. ఇలాంటి విపత్తుల సమయాల్లో... తమ ప్రభుత్వం స్పందించినంత వేగంగా బహుశా ఎక్కడా స్పందించి ఉండరని సీఎం జగన్ వ్యాఖ్యానించారు.

ఘటన జరిగిన వెంటనే 110 అంబులెన్స్‌లు తరలించారన్నారు. రెండు గంటల్లోనే ప్రభావిత గ్రామాల ప్రజలను తరలించారని పేర్కొన్నారు. ఘటన జరిగినప్పుడు ప్రభుత్వం ఎలా స్పందించాలన్నది చూపించామని చెప్పారు. బాధితులకు రూ.కోటి పరిహారం ప్రకటించడం దేశంలో ఎక్కడా లేదని... యుద్ధప్రాతిపదికన వైద్య పరీక్షలు నిర్వహించి ప్రాణన ష్టం ఎక్కువ కాకుండా చూశారని చెప్పారు. గత ప్రభుత్వమే ఈ సంస్థకు అనుమతులిచ్చిందన్నారు.

కంపెనీలోని 13 వేల టన్నుల రసాయనాన్ని 2 షిప్పుల ద్వారా తిప్పి పంపించామని జగన్ అన్నారు. గత ప్రభుత్వం నుంచే ఎల్‌జీ పాలిమర్స్ సంస్థ విస్తరణకు అనుమతులిచ్చారని సీఎం అన్నారు. పది రోజులు తిరగకముందే 12 మంది కుటుంబాలకు రూ.కోటి చొప్పున ఇచ్చామని గుర్తు చేశారు. బాధిత గ్రామాల ప్రజలకు రూ.10 వేలు చొప్పున ఇస్తున్నామన్నారు. ఆస్పత్రుల్లో 2 రోజులకు మించి ఉన్నవారికి రూ.లక్ష ఇవ్వాలని ఆదేశించానని తెలిపారు.

క్రిటికల్‌గా ఉన్న వారికి రూ.10 లక్షలు పరిహారం ఇవ్వాలని ఆదేశించినట్లు సీఎం వెల్లడించారు. పది రోజుల్లోనే పరిహారం పంపిణీని పూర్తి చేశామన్నారు.

  • ఇంకా సీఎం ఏమన్నారంటే..

తప్పు జరిగిందని నివేదిక వస్తే ఎవరినీ ఉపేక్షించం.

సంస్థ తప్పులకు సంబంధించి వారం రోజులు గడువు ఇస్తాం.

వారం, పది రోజులు గడువు ఇచ్చి వివరణ వచ్చాక నివేదిక పంపుతాం.

అధ్యయన కమిటీలు నివేదికను పూర్తిగా పరిశీలించాకే నిబంధనల మేరకు చర్యలు.

గ్యాస్ లీక్ ఘటన బాధితుల్లో ఏ ఒక్కరికీ అన్యాయం జరగదు

గ్రామాల్లో ఆస్పత్రి నిర్మాణానికి ఆదేశాలు జారీ చేశాం.

బాధితులకు ప్రత్యేక హెల్త్ కార్డులు ఇవ్వాలని ఆదేశించా.

మృతుల కుటుంబాల్లో అర్హత ఉన్నవారికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తాం

Last Updated : May 18, 2020, 3:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.