ETV Bharat / state

విశాఖ ఘటనపై సీఎం ఆరా.. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం - పరవాడ ఫార్మా సిటీలోని సాయినార్​ ఫార్మా కంపెనీలో ప్రమాదం

విశాఖ పరవాడ ఫార్మా సిటీలోని సాయినార్​ ఫార్మా కంపెనీలో ప్రమాదంపై ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆరా తీశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఫార్మా సంస్థలో రసాయన వాయువు లీకై ఇద్దరు మృతి చెందగా.. నలుగురు అస్వస్థతకు గురయ్యారు.

cm jagan
cm jagan
author img

By

Published : Jun 30, 2020, 7:53 AM IST

Updated : Jun 30, 2020, 9:47 AM IST

విశాఖ సమీపంలోని పరవాడలో సాయినార్‌ లైఫ్‌ సెన్సైస్‌ ఫార్మా కంపెనీలో ప్రమాదంపై సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆరా తీశారు. సీఎంవో అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారని.. నలుగురికి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. రాత్రి 11:30 గంటలకు రియాక్టర్‌ వద్ద లీకేజీ కారణంగా ప్రమాదం జరిగినట్లు వివరించారు.

ముందు జాగ్రత్త చర్యగా ఫ్యాక్టరీని షట్​డౌన్​ చేయించామని అన్నారు. ప్రమాదం ఫ్యాక్టరీలోని ఓ రియాక్టర్‌ ఉన్న విభాగానికే పరిమితమని.. ఎలాంటి ఆందోళన అవసరం లేదని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందించాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు.

ఇదీ చదవండి:

కరోనాకి భారత్​ బయోటెక్​ వ్యాక్సిన్​: క్లినికల్​ పరీక్షలకు డీసీజీఐ అనుమతి

Last Updated : Jun 30, 2020, 9:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.