విశాఖపట్నంలోని హిందుస్థాన్ జింక్ భూములను వేదాంత కంపెనీకి ధారాదత్తం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తోందని జింక్ కంపెనీ నిర్వాసితులు, కార్మిక సంఘాల నేతలు ఆరోపించారు. ఆ ప్రయత్నాన్ని అడ్డుకోవాలని సీఐటీయూ నేతలు పిలుపునిచ్చారు. హిందుస్థాన్ జింక్ పరిశ్రమ ఏర్పాటు కోసం 1971లో రైతులు 365 ఎకరాల భూమిని ఇచ్చారని గుర్తు చేశారు. హిందుస్థాన్ జింక్ కంపెనీ మూసివేసి వాటి స్థానంలో కాలుష్యం లేని ప్రభుత్వ పరిశ్రమలు ఏర్పాటు చేయాలని.. ఆ ప్రాంత వాసులకు ఉపాధి కల్పించాలని కోరారు. లేనిపక్షంలో ఆ భూమిని తిరిగి రైతులకు అప్పగించాలని నగర సిఐటియు ప్రధాన కార్యదర్శి ఎం.జగ్గునాయుడు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి ఒత్తిడికి తలొగ్గకుండా ప్రజల పక్షాన నిలవాలని కోరారు.
ఇదీ చూడండి:క్యూఆర్ కోడ్‌లతో కుటుంబ ఆరోగ్య కార్డులు..!