ETV Bharat / state

విశాఖలో క్రిస్మస్​ వేడుకలకు సన్నద్ధం... - Christmas celebrations in vishaka

క్రీస్మస్​ వేడుకలను నిర్వహించేందుకు విశాఖలోని పలు ప్రాంతాల్లో చర్చిలు ముస్తాబవుతున్నాయి. ఈ మేరకు క్రైస్తవులంతా ముందస్తు వేడుకల్లో నిమగ్నమయ్యారు. కొవిడ్​ నిబంధనలు అనుసరిస్తూ... ఈ పండుగను జరపనున్నారు.

Christmas celebrations
విశాఖలో క్రీస్తు జన్మదిన వేడుకలకు సన్నద్ధం...
author img

By

Published : Dec 14, 2020, 11:47 AM IST

విశాఖ జిల్లా వ్యాప్తంగా క్రీస్మస్​ వేడుకలు నిర్వహించేందుకు క్రైస్తవ మందిరాలు సిద్ధం అయ్యాయి. ఇందులో భాగంగా క్రైస్తవ సోదరులంతా ముందస్తు వేడుకల్లో నిమగ్నమయ్యారు. నర్సీపట్నం డివిజన్​లోని పలు క్రైస్తవ మందిరాలను ముస్తాబు చేస్తున్నారు. ప్రధానంగా నర్సీపట్నం పరిధి పెద్ద బొడ్డేపల్లిలోని ఆర్​సీఎం మందిరాన్ని విద్యుత్ కాంతులతో ముస్తాబు చేశారు. అలాగే రోలుగుంట, నాతవరం, రావికమతం, మాకవరపాలెం, కోటవురట్ల, గొలుగొండ... మండలాల్లోని క్రైస్తవ మందిరాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ ఏడాది కరోనా వైరస్ కారణంగా సుమారు పది నెలల పాటు ప్రత్యేక ప్రార్థనలకు దూరమైన వారంతా... ఈ వేడుకలను మరింత ఉత్సాహంగా నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు.

ఇదీ చదవండీ...

పల్నాడులో వీరుల ఆరాధనోత్సవాలు ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.