విశాఖ జిల్లా రోలుగుంట జిల్లా పరిషత్ హైస్కూల్లో చోరీ జరిగింది. పాఠశాలకు చెందిన విలువైన సామాగ్రిని గుర్తు తెలియని దుండగులు అపహరించారు. విలువైన ఎలక్ట్రానిక్ పరికరాలతో పాటు బీరువాల్లోని పత్రాలను దొంగిలించారు. హెచ్ఎం కార్యాలయపు గది తలుపులను బద్దలు కొట్టి బీరువాలను ధ్వంసం చేశారు. ఈ విషయాన్ని జిల్లా విద్యాశాఖ అధికారులకు తెలియజేయటంతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ప్రధానోపాధ్యాయులు తెలిపారు. దీనిపై దర్యాప్తు కొనసాగించేందుకు విశాఖపట్నం నుంచి క్లూస్ టీం సభ్యులు వచ్చి విచారణ కొనసాగిస్తున్నారు.
ఇదీ చూడండి: రహదారులపై దోపిడీ చేస్తున్న దొంగల ముఠా అరెస్టు