ETV Bharat / state

'త్వరలో చంద్రబాబు, లోకేశ్​ జైలుకు వెళ్లడం ఖాయం' - ఎంపీ నందిగం సురేశ్ వార్తలు

తెదేపా అధినేత చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ త్వరలోనే జైలుకు వెళ్లడం ఖాయమని మంత్రులు అన్నారు. అమరావతిలో జరిగిన అక్రమాలు బయటకు వస్తున్నాయనే అసహనంతోనే వైకాపా ఎంపీ నందిగం సురేశ్​పై దాడి చేయించారని ఆరోపించారు.

ap ministers
ap ministers
author img

By

Published : Feb 24, 2020, 6:41 PM IST

తెదేపాపై రాష్ట్ర మంత్రుల విమర్శలు

బాపట్ల ఎంపీ నందిగం సురేశ్​పై తెదేపా కార్యకర్తల దౌర్జన్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని రాష్ట్ర మంత్రులు అన్నారు. ఇవాళ విశాఖకు వచ్చిన మంత్రులు మేకతోటి సుచరిత, తానేటి వనిత, పినిపె విశ్వరూప్, ముత్తంశెట్టి శ్రీనివాసరావు.... ప్రతిపక్షనేత చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మహిళలను అడ్డుపెట్టుకుని దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. అమరావతిలో 4 వేల ఎకరాల్లో ఇన్​సైడర్ ట్రేడింగ్ జరిగినట్లు మంత్రివర్గ ఉపసంఘం గుర్తించిందని వెల్లడించారు. అమరావతిలో జరిగిన అక్రమాలు బయటకు వస్తున్నందునే తీవ్ర అసహనంతో ఎంపీ నందిగం సురేశ్​పై దాడి చేయించారని విమర్శించారు. అలాగే ఈఎస్​ఐ కుంభకోణంలో తెదేపా నేత అచ్చెన్నాయుడు పాత్ర ఉందని ఆరోపించారు. త్వరలోనే చంద్రబాబు, లోకేశ్ జైలుకు వెళ్లడం ఖాయమని అన్నారు. అమరావతిలో పర్యటించే ప్రజా ప్రతినిధులపై దాడులకు పాల్పడుతోన్న వారిని కఠినంగా శిక్షిస్తామని మంత్రులు హెచ్చరించారు.

ఇదీ చదవండి:

ఐకాస మహిళా సభ్యులపై ఎంపీ సురేశ్ అనుచరుల దాడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.