చదలవాడ సుచరిత కథనం మేరకు.. రెండేళ్లుగా కుటుంబ వివాదాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. నగరానికి చెందిన ఇద్దరు తనను హత్య చేసేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. హత్య చేసి ఆ నేరాన్ని భర్త చదలవాడ కృష్ణమూర్తిపైకి తోసేసి ఆయన్ను జైలుకు పంపించి, తద్వారా ఆస్తులు కొట్టేయాలని ప్లాన్ చేస్తున్నారని ఆరోపించారు. తనతో పాటు కుటుంబ సభ్యులపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా.. స్పందన లేదన్నారు. సీఎం జగన్ జోక్యం చేసుకుని న్యాయం చేయాలని కోరుతూ వీడియోను ఆమె విడుదల చేశారు.
ఇదీ చదవండి: 'విశాఖ ఉక్కుపై పవన్ స్పందించాలి.. భాజపా నేతలు పోరాటానికి కలసి రావాలి'