విశాఖ జిల్లా పాల్తేరు, కోటవురట్ల ప్రాంతాల్లో పంట నష్టాన్ని పరిశీలించేందుకు కేంద్ర వ్యవసాయ శాఖ అధికారుల బృందం వచ్చింది. నీట మునిగి కుళ్లిపోయిన పంటను రైతులు ఈ బృందానికి చూపించి ఆవేదన వ్యక్తం చేశారు. తమను ఆదుకోవాలని అన్నదాతలు కోరారు. నష్టపోయిన ప్రతి పంటను క్షేత్రస్థాయిలో పరిశీలించి అంచనాలు రూపొందించి నివేదిక అందజేస్తామని అధికారులు చెప్పారు. అనంతరం కేంద్ర వ్యవసాయ శాఖకు అందిస్తామని తెలిపారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.
ఇదీ చూడండి. 'ఈ - పంట'లో నమోదుకాక అన్నదాతల అవస్థలు