దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టాలంటూ.. విశాఖ జిల్లా కులవివక్ష వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో రక్షణ యాత్ర జరిగింది. నర్సీపట్నం మండలం పెద్దబొడ్డేపల్లి, ఎల్లవరం, గుండు పాల తదితర గ్రామాల్లో ర్యాలీ నిర్వహించారు. కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి చిరంజీవి.. దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని కోరారు.
విశాఖ జిల్లాకు సంబంధించి రావికమతం మండలం గుండ్లపాడులో కులాంతర వివాహం చేసుకున్నందుకు సుమారు 30 దళిత కుటుంబాలు బహిష్కరణకు గురయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. సీతానగరంలో శిరోముండనం కేసులో శ్రీకాంత్, నర్సీపట్నంలో డాక్టర్ సుధాకర్‌ను సస్పెన్షన్ ,మాడుగులలో దళితుల శ్మశాన స్థలం ఆక్రమణ తదితర ఘటనలు జపగడం బాధకరమని అన్నారు.
పార్టీలు మారిన దళితులపై దాడులు తగ్గటం లేదని ఆయన వాపోయారు. ప్రభుత్వం వీటిని అరికట్టాల్సిన అవసరం ఉందని.. అవసరమైతే ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను నియమించాలని చిరంజీవి పేర్కొన్నారు. ఎస్సీ కార్పొరేషన్ రుణాలు విడుదల చేయాలని, దళితులను అన్ని విధాల ఆదుకునే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇదీ చూడండి: