ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా కొవిడ్ బాధితుల వద్ద అధిక ఫీజులు వసూలు చేస్తున్న ఆసుపత్రిపై చీటింగ్ కేసు నమోదైంది. గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఓ ప్రైవేట్ వైద్యశాలపై నరసరావుపేట ఒకటో పట్టణ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. నకరికల్లు మండలం కర్లకుంటకు చెందిన ఓ వ్యక్తికి కరోనా సోకడంతో… నరసరావుపేట పల్నాడు రోడ్డులోని శ్రీ రాఘవేంద్ర సూపర్ స్పెషాలిటీ వైద్యశాలలో చికిత్స కోసం చేరాడు. వారం రోజుల చికిత్సకు బాధితుడి నుంచి ఆసుపత్రి యాజమాన్యం 5 లక్షల 7వేల రూపాయలు వసూలు చేశారు. డిశ్చార్జి అనంతరం చికిత్స పొందిన వ్యక్తి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు ఈ విషయమై ఫిర్యాదు చేశాడు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు స్థానిక అధికారులు బాధితుడితో మాట్లాడి.. వైద్యశాలలో రికార్డులు పరిశీలించారు. అధిక ఫీజులు వసూళ్లు చేశారని నిర్ధారణ కావడంతో అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయగా..ఆ ఆసుపత్రిపై చీటింగ్ కేసు నమోదు చేశారు.
ఇదీ చూడండి. భారత్కు చేరిన బ్రూనై, సింగపూర్ ఆక్సిజన్ సిలిండర్లు, వెంటిలేటర్లు