ETV Bharat / state

విశాఖ 47వ వార్డు కార్పొరేటర్ కామేశ్వరిపై కేసు నమోదు - ఏపీ 2021 వార్తలు

విశాఖపట్నం జిల్లా 47వ కార్పొరేటర్ కంటిపాము కామేశ్వరి, ఆమె తండ్రి చిన్నారావులపై కంచెరపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. వదినను వేధిస్తున్నారనే నెపంపైన వీరిపై కేసు నమోదు చేసినట్లు వివరించారు.

case-registered-against-visakhapatnam-47th-ward-corporator-kameshwari
విశాఖ 47వ వార్డు కార్పొరేటర్ కామేశ్వరిపై కేసు నమోదు
author img

By

Published : Sep 14, 2021, 9:09 AM IST

వదినను వేధిస్తున్న కేసులో విశాఖ 47వ వార్డు కార్పొరేటర్‌ కంటిపాము కామేశ్వరి, ఆమె తండ్రి చిన్నారావులపై కంచరపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. కంచరపాలెం ప్రాంతానికి చెందిన పెద్దాడ రమణమ్మ కుమార్తె నందిని(29), కప్పరాడ అరుంధతి నగర్‌కు చెందిన కోరిబిల్లి విజయ్‌కుమార్‌లకు 2004లో వివాహమైంది. కొంతకాలం తర్వాత నుంచి ఆడపడుచు కంటిపాము కామేశ్వరి, మామ చిన్నారావు అకారణంగా వేధిస్తున్నారంటూ నందిని తల్లికి చెప్పుకొని బాధపడుతుండేది. దీనిపై గతంలో రెండు కుటుంబాల మధ్య గొడవలు కూడా జరిగాయి.

ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం తల్లికి ఫోన్‌చేసి, వేధింపులు భరించలేక పోతున్నానని, చనిపోతానని చెప్పి నందిని ఫోన్‌ పెట్టేసింది. దీంతో ఆందోళనకు గురైన తల్లి రమణమ్మ కప్పరాడ వెళ్లింది. నందిని డెటాల్‌ తాగిందని, కంచరపాలెంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేర్పించారని స్థానికులు చెప్పడంతో అక్కడికి వెళ్లి, ఆపై కంచరపాలెం పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీఐ కృష్ణారావు ఆధ్వర్యంలో ఎస్‌.ఐ.దివ్యభారతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం నందిని వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతోంది.

ఇదీ చూడండి: నాపై రెండు హత్యాయత్నాలు చేశారు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.