గంజాయి సాగును నిర్మూలించే దిశగా విశాఖ పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా.. విశాఖ జిల్లా ఎస్పీ కృష్ణారావు సిబ్బందితో కలిసి గంజాయి తోటలను ధ్వంసం చేశారు. తుపాకీ పట్టిన చేతులతో.. కత్తి పట్టుకుని గంజాయి మొక్కలను నరికేశారు. జిల్లాలోని జి. మాడుగుల మండలం పాలమామిడి పంచాయతీ ఏడు చావళ్లు, చీకుంభంద గ్రామాల కొండల్లో 40 ఎకరాల గంజాయిని ధ్వంసం చేశారు. ఆయన వెంట నర్సీపట్నం ఓఎస్డీ సతీష్, ఎస్సై శ్రీనివాస్, మహిళా పోలీసులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: Lady police : గంజాయి తోటల్ని ధ్వంసం చేసిన మహిళా పోలీస్..అధికారుల అభినందనలు