కరోనా వైరస్ ప్రభావం నుంచి ఆర్టీసీ ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది. అన్‌లాక్ ప్రక్రియ ప్రారంభమైన తొలి రోజుల్లో కంటే బస్సులు సంఖ్య పెరగడం విశాఖ జిల్లా నర్సీపట్నం డిపో ఆదాయం కూడా పుంజుకుంటోంది. దీంతో డిపో సిబ్బంది రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తున్నారు. కరోనాకు ముందు నర్సీపట్నం ఆర్టీసీ డిపో లాభాల బాటలో పయనిస్తూ.. జిల్లాలో రెండో స్థానంలో నిలిచేది. 96 బస్సుల నడుపుతూ రోజుకి సగటున 11 నుంచి 12 లక్షల ఆదాయం ఆర్జించేది. అయితే కరోనా ప్రభావంతో బస్సులన్నీ చాలారోజులు డిపోలకే పరిమితమయ్యాయి.
నిబంధనల సడలింపుతో తొలుత 15 సర్వీసులతో కార్యకలాపాలు ప్రారంభించి, ఇప్పుడు ఆ సంఖ్యను 56కు పెంచింది. ప్రస్తుతం రోజుకు సగటున ఆరు లక్షల మేర ఆదాయం వస్తోందని అధికారులు చెబుతున్నారు. త్వరలోనే పూర్తిస్థాయి ఆర్టీసీ సేవలు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు భావిస్తున్నారు. మరో రెండు నెలల్లో ప్రయాణికులకు పూర్తిస్థాయిలో ఆర్టీసీ సేవలు అందుబాటులోకి వస్తాయని డిపో మేనేజర్ సూర్య పవన్‌కుమార్ తెలిపారు. బస్సులో మాస్కులు ఉన్న వారిని మాత్రమే అనుమతి ఇస్తున్నామని, నిలబడి ప్రయాణించే అవకాశం లేకుండా చూస్తున్నామని వెల్లడించారు.
ఇవీ చూడండి...