సంక్రాంతి అంటే మనకు మూడు రోజులే. విశాఖ జిల్లా చోడవరం, బుచ్చయ్యపేట, మాడుగుల, చీడికాడలోని ఈ యువ రైతులకు మాత్రం.. సంక్రాంతి నుంచి శ్రీరామనవమి వరకూ అన్నీ పండగ రోజులే. ఎడ్ల పందేలంటే ఆసక్తి చూపే వీళ్లంతా.. ఈ 120 రోజుల పాటు ఎక్కడ పోటీ జరిగినా వాలిపోతారు. సంక్రాంతి నుంచి శ్రీ రామనవమి వరకు పండగ తీర్థ ఉత్సవాలు చాలా ప్రాంతాల్లో జరుగుతుంటాయి. ఈ సందర్భంగా ఎడ్ల బళ్ల పరుగు పోటీలు నిర్వహిస్తారు. ఈ పోటీలకు అనువుగా ఎద్దులను పెంచుతారు. వీటి ఖరీదు అయిదు లక్షల రూపాయలుగా ఉంటుంది. అయినా.. వీటిని పోటీలకే పరిమితం చేస్తారు. ఎద్దుల పోషణకు ఖర్చు ఎక్కువే అయినా, పోటీల్లో గెలిస్తే వచ్చే ఆనందం వాటి ముందు కనిపించదంటారు... ఈ యువకులు.
ఇదీ చదవండి: