విశాఖ జిల్లా భీమునిపట్నం - నర్సీపట్నం రహదారిపై వంతెనలు శిథిలావస్థకు చేరడంతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. భారీ వాహనాలు వంతెనలపై నుంచి వెళుతుండడంతో ఏ క్షణం ఏం జరుగుతుందోనని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
చాల కాలం క్రితం నిర్మాణం...
గోవాడ , విజయరామరాజుపేట, వడ్డాది , కొత్తకోట, బాగాపురం తదితర ప్రాంతాల్లోని వంతెనలు చాలా కాలం క్రితం నిర్మించారు. ఎక్కడికక్కడే పెచ్చులూడి పోతుండడంతో వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్వారీల నుంచి పరిమితికి మించిన బరువుతో వాహనాలు నిత్యం రాకపోకలు సాగిస్తున్నాయని సత్వరమే మరమ్మతులు చేపట్టాలని వాహనదారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
'టెండర్ల ప్రక్రియ పూర్తి.. త్వరలోనే పనులు ప్రారంభం '
భీమునిపట్నం- నర్సీపట్నం రోడ్డు ఆధునీకరణకు తొలివిడతగా 70 కోట్లు మంజూరయ్యాయని చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ చెప్పారు. టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయిందని ఈ పనులు త్వరలోనే ప్రారంభం అవుతాయని తెలిపారు.
ఇదీ చదవండి: విశాఖ ప్రభుత్వ ఛాతి ఆసుపత్రికి జేడీ ఫౌండేషన్ వితరణ