కొవిడ్ నియంత్రణకు విశేషంగా కృషి చేస్తున్న సంస్థలు, అధికారులను సత్కరించేందుకు హెచ్డీఎఫ్సీ బ్యాంకు ప్రదానం చేసే అవర్ నైబర్హుడ్ హీరోస్ పురస్కారాన్ని.. బ్రాండిక్స్ భారత భాగస్వామి దొరస్వామికి అందించింది. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో రోగులకు సేవలు అందించేందుకు.. పీపీఈ కిట్లను పెద్దఎత్తున తయారు చేసి బ్రాండిక్స్ అందించిందని అధికారులు తెలిపారు. కొవిడ్ సంక్షోభంలో ఉద్యోగుల్లో స్ఫూర్తి నింపి.. వారిని అన్నివేళలా ఆదుకున్నారని బ్యాంకు అధికారులు అన్నారు. కరోనా కారణంగా విధులకు హాజరుకానప్పటికీ.. జీతాన్ని అందజేస్తూ, ఉద్యోగులను ఆదుకున్నందుక.. దొరస్వామికి ఈ గుర్తింపు లభించిందని వివరించారు. ఈ మేరకు దొరస్వామికి హెచ్డీఎఫ్సీ క్లస్టర్ హెడ్ ప్రవీణ్, ఏరియా హెడ్ సుధాకర్, బ్రాంచ్ మేనేజర్ షేక్ కామోస్ జ్ఞాపికను అందజేశారు.
ఇదీ చదవండి: 'ప్రతి పాడిపశువుకు వైద్యం అందేలా ప్రత్యేక చర్యలు'