ETV Bharat / state

సముద్ర స్నానానికి వెళ్లి ఇద్దరు పిల్లల గల్లంతు - boys drowned at coastal beach news

పుట్టినరోజు వేడుకలు ఆ పిల్లల పాలిట శాపంగా మారాయి. సరదాగా సముద్ర స్నానానికి వెళ్లి ఇద్దరు పిల్లలు గల్లంతయ్యారు. స్థానిక మత్స్యకారులు వారిని కాపాడేందుకు ప్రయత్నించినా.. ఫలితం లేకపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు గాలింపు చేపట్టారు.

సముద్ర స్నానానికి వెళ్లి ఇద్దరు పిల్లల గల్లంతు

author img

By

Published : Aug 1, 2020, 10:20 PM IST

విశాఖ జిల్లా సాగరతీరంలో విషాదం నెలకొంది. పుట్టినరోజు వేడుకల్లో భాగంగా సముద్ర స్నానానికి స్నేహితులతో కలిసివెళ్లి.. ఇద్దరు పిల్లలు గల్లంతయ్యారు. జ్ఞానాపురానికి చెందిన 8 మంది పిల్లలు కోస్టల్​ బ్యాటరీ ఎదురుగా ఉన్న సాగరతీరంలో స్నానానికి దిగారు. అలల ఉద్ధృతికి యశోవర్దన్​, రోహిత్​ కొట్టుకుపోగా.. మిగిలిన ఆరుగురు సురక్షితంగా బయటపడ్డారు. వారంతా గట్టిగా కేకలు వేయడంతో స్థానిక మత్స్యకారులు వారిద్దరినీ కాపాడేందుకు ప్రయత్నించారు. ఈ లోపే పిల్లలు సముద్ర గర్భంలోకి కొట్టుకుపోయారు.

సమాచారం అందుకున్న ఒకటో పట్టణ పోలీసులు చీకటిపడే వరకూ గాలింపు చర్యలు చేపట్టారు. అయినా వారి ఆచూకీ లభ్యం కాలేదు. ఆదివారం ఉదయం తిరిగి గాలించనున్నారు. మృతి చెందిన పిల్లల బంధువులు సముద్రతీరానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు.

ఇదీ చూడండి..

శానిటైజర్‌ తాగారని మరో 37 మంది ఒంగోలు రిమ్స్​కు​ తరలింపు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.