పందాలు తిలకిస్తున్న ప్రజలపైకి దూసుకొచ్చిన గుర్రం విశాఖ జిల్లా మునగపాకలో కనుమ రోజున నిర్వహించిన గుర్రపుపందేల్లో అపశృతి చోటు చేసుకుంది. పందేలను తిలకిస్తున్న ప్రజలపైకి గుర్రం దూసుకు రావడంతో.. ఒక్కసారిగా కలకలం రేగింది. వేగంగా వచ్చిన గుర్రం.. ఓ బాలుడిని ఢీకొట్టటంతో కిందపడ్డాడు. గుర్రం ఆగకుండా.. ఆ కుర్రాడి పైనుంచి దాటుకుంటూ పరుగులు తీసింది. అయితే గుర్రం కాలు మెలిక పెట్టడంతో ప్రమాదం తప్పింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఇదీ చదవండి:
kodi pandelu: కాసులు కురిపించిన కోడి పందేలు