విశాఖ జిల్లా పెదబయలు మండలం మారుమూల ఇంజరి పంచాయతీలో ఒకే ఒక్క నామినేషన్ దాఖలైంది. ఈ విషయం మాత్రం పంచాయతీ ప్రజలకు తెలియదు. ప్రభుత్వం బయటివారిని నిలబెట్టిందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. పంచాయతీ ఎన్నికలను బహిష్కరించాలని మావోయిస్టుల పిలుపు మేరకు.. గిన్నెల కోట, బూసిపుట్ ఇంజరి పంచాయతీల ప్రజలు ఎన్నికలకు దూరంగా ఉన్నారు.
అయితే వారికి తెలియకుండానే జాను అనే పేరు మీద నామినేషన్ దాఖలైంది. ఒకే ఒక్క నామినేషన్‌తో ఏకగ్రీవంగా సర్పంచ్ ఎన్నికయ్యే అవకాశం ఏర్పడింది. ఈ విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్న పంచాయతీ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నామినేషన్ దాఖలు చేసినవారు గతంలో ఇదే ప్రాంతానికి చెంది.. ఏడేళ్లకు ముందే వెళ్లిపోయాడని, తామంతా సర్పంచిగా వ్యతిరేకిస్తున్నామని ఆందోళన చేశారు. వెంటనే అతని నామినేషన్ రద్దు చేయాలని కోరారు.
బూసిపుట్ సర్పంచి అభ్యర్థిగా నామినేషన్ వేసిన రాజులమ్మ భర్త నాగేశ్వరరావును మావోయిస్టులు ఆదివారం అపహరించి విడిచిపెట్టారు. ఎన్నికలను బహిష్కరించాలని కొట్టినట్టు హెచ్చరించినట్లు సమాచారం.
ఇవీ చూడండి...