మహాత్మాగాంధీ సాహిత్యంపై ఆంధ్రా యూనివర్సిటీకి చెందిన భాషా శాస్త్రవేత్త, సాఫ్ట్ స్కిల్స్ ఫ్యాకల్టీ డాక్టర్ కృష్ణవీర్ అభిషేక్ రచించిన ద్విభాషా పుస్తకాన్ని.. రాష్ట్ర అధికార భాషా సంఘం ఛైర్మన్ ప్రొఫెసర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఆంధ్రా యూనివర్సిటీలో ఈరోజు విడుదల చేశారు. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ మహాత్మాగాంధీ హిందుస్థానీ భాషను ప్రోత్సహించారని అన్నారు. హిందుస్థానీ భాష ద్వారానే ఆయన సందేశాన్ని ప్రచారం చేశారని అన్నారు. అన్ని భారతీయ భాషల్లోని ప్రసిద్ధ పదజాలం, పదబంధాల సమ్మేళనంతో హిందుస్థానీ భాష అభివృద్ధి చెందాలని అన్నారు. మహాత్మా గాంధీ కమ్యూనికేషన్ లక్షణాలపై చేసిన కృషికి రచయిత డాక్టర్ కృష్ణవీర్ అభిషేక్‌ను ఆయన అభినందించారు.
ఇవీ చదవండి: