రాష్ట్రంలో బౌద్ధ ఆరామాలు, పురాతన అవశేషాలు ఉన్నప్పటికీ... వాటిని సరిగ్గా కాపాడుకోలేకపోతున్నామని ప్రముఖ రచయిత రాణిశర్మ ఆవేదన వ్యక్తం చేశారు. ''తథాగతుని అడుగుజాడలు'' అనే పుస్తకాన్ని ఆమె సహ రచయిత సుధాకర్‌తో కలిసి రచించారు. విశాఖ పౌర గ్రంథాలయంలో ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. విశాఖ పరిసరాల్లో కొన్ని బౌద్ధ ఆరామాలు ఉన్నాయని... వాటి వివరాలు పుస్తకంలో పొందుపరిచామని వివరించారు. పురాతన కట్టడాలు కాపాడటంలో... ఉత్తరాది బౌద్ధ ఆరామాలుపై ఉన్నశ్రద్ధ మన రాష్ట్రంలో కనిపించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: 'అప్రమత్తతతోనే రొమ్ము క్యాన్సర్ దూరం'