ETV Bharat / state

ఇంట్లో మందుగుండు తయారు చేస్తుండగా పేలుడు.. ఇద్దరికి గాయాలు - మందుగుండు పేలుళ్ల వార్తలు

మందుగుండు తయారు చేస్తుండగా విశాఖ జిల్లాలో.. నిప్పురవ్వలు కిరాణ దుకాణంలో పడిన ఘటనలో ప్రకాశం జిల్లాలో అగ్నిప్రమాదాలు సంభవించాయి. ఈ ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు గాయపడగా.. కిరాణ దుకాణంలో వస్తువులు దగ్ధమయ్యాయి.

blast vishaka
blast vishaka
author img

By

Published : Nov 4, 2021, 9:24 PM IST

Updated : Nov 4, 2021, 10:16 PM IST

ఇంట్లో మందుగుండు తయారు చేస్తుండగా.. పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. విశాఖ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. కురుపాం మార్కెట్ టౌన్ హాల్​ రోడ్డులోని ఓ ఇంట్లో మందుగుండు తయారు చేస్తున్నారు. ఈ క్రమంలో ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించింది.

ఈ ప్రమాదంలో ప్రసాద్, శ్రీనివాస్‌ అనే ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని పోలీసులు.. కేజీహెచ్​కు తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేశారు.

నిప్పురవ్వలు అంటుకుని అగ్నిప్రమాదం..
తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం ధర్మవరంలో అగ్నిప్రమాదం జరిగింది. ఓ కిరాణ దుకాణంలో బాణసంచా నిప్పురవ్వలు పడి మంటలు వ్యాపించాయి. దుకాణంలోని వస్తువులు దగ్ధం అయ్యాయి. దుకాణంలో గ్యాస్, పెట్రోల్, డీజిల్ ఉండడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో ఘటనాస్థలికి చేరుకుని మంటలార్పారు.

ఇదీ చదవండి: Gold Fraud: దుబాయ్ గోల్డ్ తక్కువ ధరకే.. ఫేస్​బుక్​లో ప్రకటన.. ఆ తర్వాత?

Last Updated : Nov 4, 2021, 10:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.