భాజపా రాష్ట్ర కార్యదర్శి లోకుల గాంధీ ఆకస్మికంగా మృతి చెందారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 2014, 2019లో పాడేరు నియోజకవర్గ భాజపా అభ్యర్థిగా ఆయన పోటీ చేసి ఓటమి పాలయ్యారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో లోకుల గాంధీ కీలక పాత్ర పోషించారు. కేంద్ర కాఫీ బోర్డ్ ఛైర్మన్‌గా కూడా పని చేశారు. మన్యం ప్రాంతంలో భాజాపా పార్టీని ముందుండి నడిపించారు.
ఆయన మరణం పట్ల భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, భాజపా నేతలు సంతాపం వ్యక్తం చేశారు. గాంధీ స్వగ్రామమైన కొయ్యూరు మండలం శరభన్నపాలెంలో అంత్యక్రియలు జరగనున్నాయి. అంతిమ యాత్రలో పాల్గొనేందుకు సోము వీర్రాజు తన కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు.
ఇదీ చదవండి