కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను కేవలం కాంగ్రెస్, వామపక్ష పార్టీలు మాత్రమే వ్యతిరేకిస్తున్నాయని ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు. విశాఖ జిల్లా నక్కపల్లిలో వ్యవసాయ చట్టాలపై రైతులు, కార్యకర్తలకు ఆయన అవగాహన కల్పించారు. చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్, హరియాణా రైతులు మాత్రమే ఆందోళన చేస్తున్నారన్నారు. వామపక్ష పార్టీల నేతలు పాత మూస ధోరణి పద్ధతులు, సిద్ధాంతాల కోసం పాటు పడుతున్నారని, భారత్ అభివృద్ధిని విస్మరిస్తున్నారన్నారు. నూతన వ్యవసాయ చట్టాల ద్వారా రైతులకు పూర్తి స్వేచ్ఛ కల్పించేందుకు ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.
ఇదీ చదవండి : శ్రీశైలం జల విద్యుత్ కేంద్రాన్ని పరిశీలించిన కృష్ణా బోర్డు సభ్యుడు