ప్రభుత్వం రవాణా సదుపాయం కల్పిస్తున్నప్పటికీ... చాలా చోట్ల వలస కూలీలు కాలినడకనే స్వగ్రామాలకు వెళ్తున్న పరిస్థితులు నిత్యం కనిపిస్తున్నాయి. విశాఖ జిల్లా అనకాపల్లి జాతీయ రహదారి మీదుగా.. ఇలా కాలినడకన వెళ్తున్న కార్మికులకు భాజపా నేతలు అండగా నిలిచారు.
పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా ప్రధాన కార్యదర్శి కొణతాల అప్పలరాజు ఆధ్వర్యంలో చెప్పుల జోళ్ళు పంపిణీ చేశారు. వలస కార్మికుల కాళ్ళకు చెప్పులు తొడిగి రొట్టెలు పంపిణీ చేశారు. లాక్డౌన్ ప్రారంభమైనప్పటి నుంచీ దాతల విరాళాలతో సేవా కార్యక్రమం చేస్తున్నట్లు కొణతాల అప్పలరాజు తెలిపారు.
ఇవీ చూడండి: