దేశానికి అరుణ్ జైట్లీ అందించిన సేవలు ప్రశంసనీయమని భాజపా అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు డాక్టర్ సత్యనారాయణ తెలిపారు. విశాఖ జిల్లా అనకాపల్లి భాజపా కార్యాలయంలో అరుణ్ జైట్లీ వర్ధంతిని నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశ ఆర్థిక శాఖ మంత్రిగా అరుణ్ జైట్లీ అందించిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో భాజపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇవీ చదవండి: సాంకేతికత వినియోగంలో మేటి కానీ... పాలనలో పారదర్శకతలేదు