విశాఖ బీచ్ లోని నేవీ విజయ స్తూపం దగ్గర విశాఖ భాజపా నేతలు త్రివర్ణ పతాకాన్నిచేత పట్టి అమరవీరులకు నివాళి అర్పించారు. మాజీ పార్లమెంట్ సభ్యుడు కంభంపాటి హరిబాబు ఈ కార్యక్రమంలో పాల్గొని అమర సైనికులకు నివాళి అర్పించారు. చైనా కవ్వింపు చర్యలు శ్రుతి మించాయని, భారత సైనికుల మృతికి కారకులైన వారిని వదిలిపెట్టకూడదని అన్నారు. చైనా సైనికులను సమర్ధవంతంగా భారత సైన్యం ఎదుర్కొందని కొనియాడారు.
ఇది చదవండి కోనాం గ్రామ సచివాలయం సిబ్బందిపై ఫిర్యాదు