విశాఖ జిల్లా డుంబ్రిగూడ మండలంలో విత్తనాల కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. పంపిణీ కేంద్రం వద్ద దాదాపు రెండు రోజులపాటు నిరీక్షించినా... ఫలితం శూన్యమని ఆవేదన చెందుతున్నారు. విశ్వప్రయత్నాలు చేసినా.. విత్తనాలు అందటంలేదని వాపోతున్నారు. పెద్ద సంఖ్యలో తరలివస్తున్నా.. బయోమెట్రిక్ విధానంతో వేలిముద్రలు తీసుకోవడంలో తీవ్రమైన జాప్యం జరుగుతోందని ఆరోపించారు. తమకు విత్తనాలను అందించేందుకు సరళమైన విధానాన్ని అనుసరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: