Bike rally: విశాఖ స్టీల్‌ప్లాంట్‌తో పాటు.. ప్రభుత్వ రంగ సంస్థల రక్షణ కోసం మార్చి 28న తలపెట్టి అఖిల భారత సమ్మెను జయప్రదం చేయాలంటూ.. కార్మిక, ప్రజా సంఘాల ఐకాస విశాఖలో ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించింది. అఖిలపక్ష కార్మిక సంఘాలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో.. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నుంచి ర్యాలీ చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ కొనసాగించారు. ఈ సందర్భంగా ఐకాస నాయకులు మాట్లాడుతూ అఖిల భారత సమ్మెను విజయవంతం చేయాలని కోరారు.
ఇదీ చదవండి:
Murder Case: ఆలయంలో పూజారి హత్య కేసు.. చంపిందెవరో తెలుసా?