విశాఖ జిల్లా అనకాపల్లి మండలం దర్జీ నగర్ లో రహదారికి అడ్డంగా చెట్టు పడిపోయింది. ఈ కారణంగా... రహదారిపై వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. పెద్దగా గాలులతో కూడిన వర్షాలు లేనప్పటికీ రహదారిపై చెట్టు కూలింది. ఘటన సమయంలో ఎవరూ అక్కడ లేకపోవడం.. పెద్ద ప్రమాదాన్ని తప్పించింది.
చిన్న వాహనాలు రహదారి పక్కనుంచి రాకపోకలు సాగించగా.. పెద్ద వాహనాలు మాత్రం రోడ్డుపైనే నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు స్పందించారు. చెట్టును రహదారిపై నుంచి తొలిగించి సమస్యను పరిష్కరించారు. రాకపోకలు క్రమబద్ధీకరించారు.
ఇవీ చూడండి: