ETV Bharat / state

'వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలి' - bharat bandh in vishaka news

రైతు సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు విశాఖలో భారత్ బంద్ ప్రశాంతంగా ముగిసింది. వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరిగాయి.

bharat bandh in vishakapatnam
విశాఖలో వామపక్షాల నిరసన... నిలిచిన వాహనాలు
author img

By

Published : Dec 8, 2020, 9:26 AM IST

Updated : Dec 8, 2020, 6:20 PM IST

విశాఖలో వామపక్షాల నిరసన... నిలిచిన వాహనాలు

రైతులకు మద్దతుగా విశాఖలో వామపక్షాలు భారత్ బంద్​ నిర్వహించాయి. వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలని నేతలు డిమాండ్ చేశారు.

విశాఖ - కోల్​కత్తా జాతీయ రహదారిపై వామపక్షాల నిరసనతో... మద్దిలపాలెం వద్ద జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. పాడేరులో ఆందోళనకారులు వాహనాలను అడ్డుకున్నారు. విశాఖ ఏజెన్సీలో వామపక్షాలు, గిరిజన సంఘం, గిరిజన ఐకాస సంఘం సంయుక్తంగా బంద్​కు మద్దతిచ్చాయి. పాడేరులో వ్యాపారులు దుకాణాలు స్వచ్ఛందంగా మూసివేశారు. నర్సీపట్నంలో సబ్ డివిజన్​లో భారత్ బంద్ ప్రశాంతంగా కొనసాగింది. విశాఖ మన్యంతో పాటు విశాఖ, చోడవరం, తుని, అనకాపల్లి వెళ్లాల్సిన బస్సు సర్వీసులను నిలిపివేశారు.

'వ్యవసాయ చట్టాలు వెంటనే రద్దు చేయాలి'
'వ్యవసాయ చట్టాలు వెంటనే రద్దు చేయాలి'

అనకాపల్లిలో వామపక్షాలు, ప్రజాసంఘాలు, సీఐటీయూ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. అన్ని రకాల దుకాణాలు మూసివేశారు. ఆర్టీసీ బస్సులన్నీ బస్టాండ్లలోనే నిలిచిపోయాయి. విశాఖ నగరంలో వామపక్షాలు బంద్​ను ప్రశాంతంగా నిర్వహించాయి. మోదీ ప్రభుత్వం చేసిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని నేతలు డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ, సీఐటీయూ, ఏఐఎఫ్​టీయూ తదితర కార్మిక సంఘాలు... జాతీయ రహదారిలో రాస్తారోకో నిర్వహించాయి.

ఇదీ చదవండి:

నేడు రాజధాని వ్యాజ్యాలపై ప్రభుత్వ వాదనలు

Last Updated : Dec 8, 2020, 6:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.