తన కారు డ్రైవర్ మృతికి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ బాధ్యత వహించాలని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి డిమాండ్ చేశారు. అనకాపల్లి ఎన్టీఆర్ జిల్లా ఆస్పత్రిలో డ్రైవర్ మృతదేహాన్ని చూసిన ఆయన భోరున విలపించారు. సన్యాసినాయుడు 18 ఏళ్లుగా తన వద్ద డ్రైవర్ గా పని చేస్తున్నాడని సన్యాసినాయుడుని తన కుటుంబ సభ్యునిగానే భావించానని అన్నారు.
డ్రైవర్ ఇళ్లు కట్టుకుంటే వాలంటీరు డబ్బులు డిమాండ్ చేస్తున్నాడని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా.. గ్రామ పెద్దలు చెప్పినా.. పట్టించుకోలేదని బండారు సత్యనారాయణ పేర్కొన్నారు. గ్రామ వాలంటీర్ల ఆగడాలు శృతి మించుతున్నాయని ఆయన మండిపడ్డారు. ఈ సంఘటనపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. గ్రామ వాలంటీర్లను వెనకేసుకొస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డి దీనికి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. గ్రామ వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలని అన్నారు.
ఇదీ చదవండి: