విశాఖ మన్యంలో రూ. 7 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లను పోలీసులు పట్టుకున్నారు. ఒడిశా నుంచి బొలెరో వాహనంలో వి.మాడుగులకు తరలిస్తున్న గుట్కా ప్యాకెట్లను పోలీసులు గుర్తించారు.
హుకుంపేట మండలం దిగుడుపుట్టు వంతెన వద్ద పోలీసులు తనిఖీ చేస్తుండగా వాహనం పట్టుబడింది. గుట్కా ప్యాకెట్లను అక్రమంగా రవాణా చేస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ అప్పలనాయుడు తెలిపారు.
ఇదీ చదవండి: