విశాఖ జిల్లాలో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. రోలుగుంట మండలం కొవ్వూరు, పాపంపేట, సింగరాజుపేట తదితర ప్రాంతాల్లో కోతకు వచ్చిన అరటి తోట దెబ్బతింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతోపాటు ఈదురు గాలులు వచ్చి అరటి తోటలన్ని ధ్వంసమయ్యాయి. అధిక పెట్టుబడులతో పంట వేస్తే అకాల వర్షానికి అంతా నేలకొరిగిందని రైతులు వాపోయారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.
ఇదీచూడండి. నిండుకుండలా పెద్దేరు జలాశయం.. రైతుల్లో ఆనందం