ETV Bharat / state

'అధికారంలో ఉండి దద్దమ్మ ఆరోపణలు చేస్తున్నారు' - Ayyanna Patrudu comments on jagan

సీఎం జగన్, ఎంపీ విజయసాయిరెడ్డిపై మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. లోటస్​పాండ్ వేదికగా... హిందూమతంపై విషం చిమ్మే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. వివేకా హత్య కేసులో నిజాలు బయటకు రాకుండా చేాశారని విమర్శించారు. అన్ని వాళ్లు చేసి చంద్రబాబు, లోకేశ్​పై ఆరోపణలు చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Ayyanna Patrudu fires on jagan over antarvedi Incident
అయ్యన్నపాత్రుడు
author img

By

Published : Sep 11, 2020, 3:45 PM IST

జగన్ రెడ్డి, సాయిరెడ్డి డైరెక్షన్​లో పక్కా ప్రణాళికతో హిందూత్వంపై దాడి జరుగుతోందని తెదేపా పొలిట్​బ్యూరో సభ్యులు అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. తిరుమల కొండపై అన్యమత ప్రచారం, దేవతా విగ్రహాలు ధ్వంసం, 60 వేల కోట్ల విలువైన మాన్సాస్ భూములు మింగడం, అంతర్వేదిలో రథం తగలబెట్టడం.. అందులో భాగమేనని ఆయన ఆక్షేపించారు. ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టిన జగన్ రెడ్డి... మతాల మధ్య చిచ్చుపెడుతున్నాడని మండిపడ్డారు. రథాన్ని కాల్చింది పిచ్చోడు, తేనెటీగలన్న సాయిరెడ్డి.. ఇప్పుడు చంద్రబాబు, లోకేశ్​పై విషం కక్కుతున్నారా అని నిలదీశారు.

సాయిరెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసి నాలుగు తగిలిస్తే.. లోటస్​పాండ్ వేదికగా హిందూత్వంపై జరుగుతున్న కుట్ర బయటపడుతుందని అయ్యన్న అభిప్రాయపడ్డారు. వివేకా చనిపోతే ముందు గుండెపోటు అన్న దొంగ బ్యాచ్... తరువాత బాబాయ్​ని చంద్రబాబు, లోకేశ్ చంపేశారన్నారని, దీనిపై సీబీఐతో విచారణ చేయించాలని చిల్లర హడావిడి చేాశారని విమర్శించారు. అధికారంలోకి వచ్చాకా బాబాయ్​ని లేపేసింది అబ్బాయ్ జగన్ రెడ్డే అనే విషయం బయటపడకుండా సీబీఐ విచారణను అడ్డుకోవడానికి కుట్ర పన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయసాయిరెడ్డి అధికారంలో ఉండి దద్దమ్మ ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

ఇదీ చదవండీ... 'వైఎస్​ఆర్ ఆసరా'కు సీఎం జగన్‌ శ్రీకారం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.