ప్రపంచ స్ట్రోక్ డే సందర్భంగా విశాఖలో సెవెన్ హిల్స్ ఆస్పత్రి వైద్యులు అవగాహన నడక నిర్వహించారు. ఈ నడకను నగర పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ మీనా ప్రారంభించారు. ముఖ్యంగా మెదడులో రక్త ప్రసరణ సక్రమంగా జరగకపోవటం వల్ల సంభవించే నష్టాలు, పక్షవాతం రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాలపై వైద్యులు వివరించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, ఆస్పత్రి సిబ్బంది, నర్సింగ్ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఇదీ చదవండి: