తెలుగుదేశం నాయకులు ఆరోపిస్తున్నట్టుగా చంద్రబాబు పర్యటనలో జరిగిన పరిణామాలతో ప్రత్యక్షంగా, పరోక్షంగా వైకాపాకు ప్రమేయం లేదని పర్యటకశాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. విశాఖలో రాజధాని అనే విషయంపై నోటికి వచ్చినట్లు చంద్రబాబు మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. విశాఖ ప్రజలను రెచ్చగొట్టినందుకే నిరసన ఎదురైందన్నారు. విశాఖ జిల్లాలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తామంటే తెదేపా అధినేత ఓర్వలేక పోతున్నారని ఆక్షేపించారు.