జీవో నెం.21 రద్దు చేయాలని కోరుతూ విశాఖలో ఆటో డ్రైవర్లు నిరసన చేపట్టారు. ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదుట ప్లకార్డులు పట్టుకుని ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. లాక్ డౌన్ కారణంగా ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులతో ఉన్న ఆటో కార్మికులపై అధిక భారం కలిగించే చర్యలను ప్రభుత్వం తీసుకోవద్దంటూ ఆటో డ్రైవర్లు విజ్ఞప్తి చేశారు. ఆటో కార్మిక సంఘం, సీఐటీయూ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ నిరసనలో ఆటోకార్మికులు, సీఐటీయూ నాయకులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి :