ETV Bharat / state

ఇసుక కొరతను నివారించేందుకు అధికారుల చర్యలు

author img

By

Published : Jul 15, 2020, 9:32 AM IST

విశాఖ జిల్లాలో ఇసుక కొరతను నివారించేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. స్టాక్ పాయింట్​లో ఇసుక నిల్వలను సమృద్ధిగా ఉంచడంతో పాటు ఇసుక ర్యాంపులు ప్రారంభించారు.

authorities takes measures to avoid sand shortage
ఇసుక కొరతను నివారించేందుకు అధికారుల చర్యలు

విశాఖ జిల్లాలో ఇసుక కొరతను నివారించేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. స్టాక్ పాయింట్​లో ఇసుక నిల్వలను సమృద్ధిగా ఉంచడంతో పాటు ఇసుక ర్యాంపులు ప్రారంభించారు. చోడవరం మండలం నర్సాపురం వద్ద గనుల శాఖ అధ్వర్యంలో ఏర్పాటైన స్టాక్ పాయింట్ వద్ద పుష్కలంగా ఇసుక ఉంది. దాదాపు 100టన్నులకు పైబడి ఇసుక నిల్వలు ఉన్నాయి. ఇక్కడ నుంచి ఇసుకను... చోడవరం, మాడుగుల నియోజకవర్గాల్లో చేపట్టే నిర్మాణ పనులకు వినియోగిస్తున్నారు. మండలంలోని శారదా నది పరీవాహక ప్రాంతమైన జుత్తాడలో ఇసుక ర్యాంపును అధికారులు ప్రారంభించారు. శారదా, పెద్దేరు, బొడ్డేరు నదులలో మరిన్ని ఇసుక ర్యాంపులు ప్రారభించేందుకు అధికారులు ప్రతిపాదించారు.

ఇదీ చదవండి:

'సాగులో ఉన్న పోడు, అటవీ భూములకు పట్టాలివ్వాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.