ఆంధ్రా ఊటీ అరకు లోయ సందర్శించే పర్యాటకులకు డుంబ్రిగుడ మండలంలోని చాపరాయి జలపాతం ఆకర్షిస్తోంది ఈ నీటి ప్రవాహంలో విహారం చేసేందుకు ఆసక్తి చూపుతుంటారు. ఆదాయం భారీగానే వస్తున్నా... కనీస సౌకర్యాలు కల్పించడంలో మాత్రం అధికారులు విఫలమవుతున్నారు. ప్రవేశ రుసుం దేనికి వసూలు చేస్తున్నారని సందర్శకులు ప్రశ్నిస్తున్నారు.
జలపాతం వద్ద స్నానాలు చేసి.. నీటి ప్రవాహంలో సేద తీరుతామని అనుకున్న వారికి ఎలాంటి సౌకర్యాల్లేవు. బట్టలు మార్చుకునేందుకు ఏర్పాట్లు లేవు. తాగునీరు సైతం అందుబాటులో లేదు. చిన్నారుల కోసం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్న పరిస్థితి అక్కడ కనిపంచడం లేదు. ఈ అసౌకర్యాలతో సందర్శకులు ఇబ్బంది పడుతున్నారు. చాపరాయి జలపాతం వద్ద ఊహించని ప్రమాద ప్రాంతాలు ఉన్నాయి.. ఎలాంటి హెచ్చరిక బోర్డులూ లేవంటున్నారు పర్యాటకులు.
చాపరాయి జలపాత ప్రాంతాన్ని మరింత అందంగా తీర్చిదిద్దితే మరింత మంది వచ్చే అవకాశం ఉందంటున్నారు పర్యాటకులు. పర్యాటక శాఖ ఐటీడీఏ అధికారులు సంయుక్తంగా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
ఇవీ చదవండి