విశాఖ జిల్లా రోలుగుంట మండలం కొతలం శివారులో ఉన్న పాపంపేట గ్రామ వాలంటీర్‌పై... ఓ వ్యక్తి కత్తితో హత్యాయత్నం చేశాడు. నిందితుడిని మహిళా వాలంటీర్ భర్తగా గుర్తించారు. తన భార్యతో.. ఆ వాలంటీర్ కు వివాహేతర సంబంధం ఉందని అనుమానించి.. ఈ ఘాతుకానికి పాల్పడ్డట్టు తేల్చారు.
ట్రాక్టర్ పై వెళ్తున్న బాధితుడిని.. పథకం ప్రకారం దాడి చేసినట్టు పోలీసులు తెలిపారు. బాధితుడిని స్థానికులు నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు విశాఖలోని కేజీహెచ్‌కు పంపించారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: