విశాఖలో ఏటీఎం లో రూ. 9లక్షలు చోరీ చేసిన కేసులో పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. నిందితులను బెంగళూరులో అరెస్టు చేసినట్లు క్రైమ్ డీసీపీ సురేష్ బాబు వెల్లడించారు. నిందుతులు పంజాబ్ కు చెందిన సమర్ జోత్ సింగ్, కేరళ రాష్ట్రానికి చెందిన జాఫర్ సాదిక్ గా గుర్తించారు. వారి నుంచి లక్షా 32 వేల 500 రూపాయల నగదును, 9 కాలిన 500 రూపాయల నోట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల వద్ద లభించిన రెండు ఖరీదైన సెల్ ఫోన్లతో పాటు ఇతర వస్తువుల విలువ మరో రూ.3లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. సమర్ జోత్ సింగ్ సోదరుడు హర్మిత్ సింగ్ కు రూ.3 లక్షల నగదును పంపించిన రసీదును సైతం పోలీసులు స్వాధీన పరుచుకున్నారు.
ఈ నెల 22 అర్థరాత్రి విశాఖలో ఏటీఎం పగలగొట్టి రూ.9 లక్షలు దొంగిలించారు. ఈ ఘటనలో నిందుతులను పట్టుకునేందుకు పోలీసులు 6 ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. ఈ కేసులో నిందితులు గతంలోనూ ఈ తరహా చోరీలకు పాల్పడినట్లు డీసీపీ సురేష్ బాబు తెలిపారు.
ఇదీ చదవండి: పోలవరం 'డ్యామ్' నిర్మాణానికే నిధులు: కేంద్రం