విశాఖ జిల్లాలోని మాకవరపాలెం మండలం రాచపల్లి వద్ద వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో అల్యూమినియం పరిశ్రమ ఏర్పాటైంది. అవసరమైన ముడి సరకును మన్యంలోని గూడెం కోతవేది, చింతపల్లి మండలాల్లో తవ్వకాలు చేపట్టి ఏపీ ఎండీసీ ద్వారా అందించేందుకు ఒప్పందం కుదిరింది. అయితే ఆ ప్రాంతాల్లో తవ్వకాలు నిలిపేయాలని పోరాటాలు జరిగాయి. దీంతో పరిశ్రమలో ఉత్పత్తి ప్రారంభం కాలేదు.
తవ్వకాల ఒప్పందాలు రద్దు
తెదేపా హయాంలో బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకిస్తూ ఒప్పందం రద్దు చేసింది. దీనిపై ఆ కంపెనీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసులు వేసింది. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బాక్సైట్ తవ్వకాల జీఓను రద్దు చేశారు. కొంతకాలం తర్వాత పరిశ్రమతో ఉన్న న్యాయపరమైన వివాదాలను ఆర్బిట్రేషన్ ద్వారా పరిష్కరించుకునేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. ఇందుకోసం ప్రత్యేక కమిటీ వేసింది.
ముడి సరుకు కోసం ప్రత్యామ్నాయం
పరిశ్రమలో ఉత్పత్తి ప్రారంభించేందుకు అవసరమైన ప్రత్యామ్నాయ వనరులను సమకూర్చుకునేందుకు ప్రభుత్వం అనుమతించినట్లు తెలుస్తోంది. స్థానికంగా ముడి సరుకు సమీకరించుకునే అవకాశాలు లేకపోవటంతో ఒడిశా నుంచి తెప్పించుకునేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. దీనిలో భాగంగానే నక్కపల్లి మండలంలో ఆన్రాక్ సొంతంగా మినీ పోర్ట్ నిర్మించుకోడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది.
2020-21 సామాజిక, ఆర్థిక సర్వేలో ఈ విషయాన్ని స్పష్టంగా పేర్కొన్నారు. ఈ పోర్ట్ నుంచి ఏడాదికి నాలుగు మిలియన్ మెట్రిక్ టన్నుల సరకు రవాణా జరగనుందని కంపెనీ తెలిపింది. ఇందుకు అవసరమైన ప్రత్యేక రైల్వే లైను ఏర్పాటు చేసుకుంటామని ప్రభుత్వానికి ప్రతపాదనలు పంపగా... దీనికి ఇటీవల ఆమోదం లభించినట్టు సమాచారం.
ఇదీ చదవండి: