ETV Bharat / state

aqua culture: విచ్చలవిడిగా ఆక్వాసాగు.. కాలుష్య కాసారాలుగా జలవనరులు - pollution in aqua culture at vishakapatnam

విశాఖ జిల్లాలో విచ్చలవిడి ఆక్వాసాగుతో జలవనరులు కాలుష్య కాసారాలుగా మారుతున్నాయి. అధికారుల అండదండలతో రాజకీయనాయకులు ఇష్టారాజ్యంగా ఎక్కడపడితే అక్కడ చెరువులు తవ్వుతున్నారు. స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నా పట్టించుకోవడం లేదు. పంట భూములూ పనికి రాకుండా పోతున్నాయని రైతులు వాపోతున్నారు.

aqua culture at vishaka patnam creating water pollution at vishakapatnam

author img

By

Published : Aug 9, 2021, 12:26 PM IST

విచ్చలవిడిగా ఆక్వాసాగు..

విశాఖ జిల్లాలో అక్రమ ఆక్వాసాగు(aqua culture) పెద్ద ఎత్తున జరుగుతోంది. పాయకరావుపేట, నక్కపల్లి, ఎస్‌.రాయవరం, రాంబిల్లి మండలాల్లో సుమారు వెయ్యి హెక్టార్లలో రొయ్యల చెరువులు సాగవుతున్నాయి. వీటిలో 30 శాతం చెరువులకే అనుమతులుండగా.. మిగతా వాటిని అనధికారికంగానే నిర్వహిస్తున్నారు. నదులు, ప్రభుత్వ భూములను ఆక్రమించి మరీ రొయ్యల, చేపల చెరువులను సాగు (aqua culture) చేస్తున్నారు. వాస్తవానికి సాగుకు పనికిరాని భూముల్లోనే చెరువులు ఏర్పాటు చేయాలి. కానీ జిల్లాలో మంచి దిగుబడినిచ్చే పంట భూముల మధ్య, నదీ ప్రాంతాలకు ఆనుకుని చేపలు, రొయ్యల చెరువులు సాగవుతున్నాయి. వీటికి తోడు పుట్టగొడుగుల్లా హేచరీలు, రొయ్యల శుద్ధి పరిశ్రమలు వెలుస్తున్నాయి. వీటి నుంచి వెలువడే ప్రమాదకర రసాయనాలను నేరుగా.. సాగు నీటి కాలువల్లోకి విడుదల చేస్తున్నారు. ఈ ప్రభావం పల్లెలపై పడుతోంది.

పాయకరావుపేట మండలంలోని పాల్మన్‌పేట, రత్నాయంపేట, రాజానగరం, రాజవరం, పెంటకోట పరిధిలో 400 ఎకరాల విస్తీర్ణంలో చేపల, రొయ్యల చెరువులు సాగు (aqua culture) చేస్తున్నారు. వీటిలో చాలా వాటికి అనుమతులులేవు. రొయ్యల పెంపకానికి విచ్చలవిడిగా నిషేధిత మందులు వాడుతున్నారు. చెరువుల శుద్ధికి బ్లీచింగ్‌, ఫార్మాలిన్‌ ఇతర ద్రావణాలను వినియోగిస్తున్నారు. ఈ వ్యర్థాలను పైపుల ద్వారా పంపా నదిలోకి వదులుతున్నారు. దీంతో నీరు కలుషితమై (pollution) రంగు మారి.. తీవ్ర దుర్వాసన వస్తోంది. నదిలో చేపల లభ్యత తగ్గి.. ఉపాధి పోయిందని మత్స్యకారులు వాపోతున్నారు.

ఎస్‌.రాయవరం మండలంలోని చాలా గ్రామాల్లో ప్రభుత్వ, డి-పట్టా భూముల్లో అక్రమంగా ఆక్వా చెరువులు (aqua culture) తవ్వి వ్యాపారం చేస్తున్నారు. వాకపాడులో సర్వే నంబర్‌ 420లో ఎకరంన్నర ప్రభుత్వ భూమిని ఆక్రమించి స్థానిక అధికార పార్టీ నేతలే చెరువులు సాగు చేస్తున్నారు. రాంబిల్లి మండలంలో శారదా నది గర్భంలో సుమారు 10 ఎకరాల్లో చేపల చెరువులు (aqua culture) తవ్వారు. మరో 10 ఎకరాలనూ ఆక్రమించుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. వ్యవసాయ కనెక్షన్లు ఇవ్వడానికి కాళ్లరిగేలా తిప్పించుకునే విద్యుత్‌ అధికారులు.. చేపల, రొయ్యల చెరువుల కోసం ట్రాన్స్‌ఫార్మర్లు, కనెక్షన్లు అడిగిన వెంటనే ఇస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.