విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న ఆలయంలో నేటి నుంచి ఏడు రోజుల పాటు స్వామి వారి కల్యాణోత్సవాలు జరగనున్నాయి. కొవిడ్ దృష్ట్యా భక్తులను అనుమతించకుండా..ఏకాంతంగా కార్యక్రమం నిర్వహించనున్నారు. వైదిక పాంచరాత్ర ఆగమ శాస్త్రం ప్రకారం అన్ని పూజలు నిర్వహించి.. స్వామి వారికి కల్యాణం జరిపిస్తామని ఆలయ అధికారులు తెలిపారు. ఇందుకోసం చేసిన ఏర్పాట్లలో భాగంగా ఆలయాన్ని విద్యుద్దీపాలతో అందంగా అలంకరించారు. గాలిగోపురానికి చేసిన అలంకరణ ఆకట్టుకుంటోంది.
ఇదీ చదవండి: కోదండరామస్వామి ఆలయంలో ఘనంగా శ్రీరామ నవమి