విశాఖ-చెన్నై పారిశ్రామిక నడవాలో భాగంగా... విశాఖ జిల్లా నక్కపల్లిలో 3వేల 899 ఎకరాల్లో పారిశ్రామిక పార్క్ ఏర్పాటుకు సంబంధించిన ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతోంది. 1,191 కోట్ల రూపాయల వ్యయంతో పారిశ్రామిక సముదాయంలో మౌలిక వసతులను అభివృద్ధి చేయనున్నారు. ఏపీఐఐసీ ఆధ్వర్యంలో రాజయ్యపేటలో భారీ పోలీస్ బందోబస్తు మధ్య ప్రజాభిప్రాయ సేకరణ చేపడుతున్నారు. కొవిడ్ నిబంధనలు మేరకు 300 మందికే అనుమతి ఇచ్చారు. దీనిని వ్యతిరేకిస్తూ రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు ఆందోళనకు సిద్ధమయ్యాయి.
ఇదీ చదవండి:
'తొలిదశలో గుర్తిస్తేనే ఊపిరితిత్తుల క్యాన్సర్‌ను తగ్గించవచ్చు'