ముఖ్యమంత్రి సహకారంతో నియోజకవర్గాన్నిఅభివృద్ధి పథంలో పరుగులెత్తించామన్నారు విశాఖపట్నం జిల్లా పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి. నియోజకవర్గంలో లక్షా ముప్ఫైవేల మంది సంక్షేమ ఫలాలు అందుకుంటున్నట్టు చెప్పారు.మళ్లీ తెదేపానే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాల అమలులో రాష్ట్రంలో 28 స్థానంలో ఉన్నామన్న సత్యనారాయణమూర్తి... నియోజకవర్గ ప్రగతి నివేదికను వెల్లడించారు.
సంక్షేమంలో పెందుర్తి:
-
రైతులకు సుమారు 22 కోట్ల రుణ మాఫీ
-
నియోజకవర్గంలో సుమారు 29 వేల మందికి పింఛన్లు
-
పసుపు - కుంకుమ ద్వారా రూ. 140 కోట్లు పంపిణీ
-
చంద్రన్న బీమా ద్వారా రూ. 1.78 కోట్ల ఆర్థిక సాయం
-
నాలుగువేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు
-
గ్రామాల్లో రోడ్లు, పంచాయతీ భవనాల నిర్మాణం
ఇవీచదవండి