- రాష్ట్రంలో రెచ్చిపోతున్న వైసీపీ నేతలు
Harassment of YCP Laders: రాష్ట్రంలో వైసీపీ నాయకులు, కార్యకర్తల అరాచకాలు పరాకాష్టకు చేరాయి. అడ్డుగా ఉన్నవారిని అంతం చేయడం, ఎదురుతిరిగిన వారిపై కక్ష సాధించడమే పని అన్నట్లు.. వైసీపీ వర్గీయులు రెచ్చిపోతున్నారు. సామాన్య జనం భరించలేనంతగా అకృత్యాలు పెరిగిపోయాయి. వేధింపులు భరించలేక కొందరు ఆత్మహత్య చేసుకోగా, మరికొందరు బలవన్మరణాలకు యత్నించారు. దళితులు, గిరిజనులు, సామాన్యుల భూములను కబ్జా చేస్తున్న ఘటనలకు కొదువ లేదు. చివరికి శ్మశాన వాటికలనూ వదలట్లేదు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- వైసీపీ నేతల అంతులేని అరాచకాలు..
Harassments in YSRCP Govt: వైసీపీ అధికారంలోకి వచ్చాక జరిగిన అరాచకాలకు అంతే లేదు. భూముల కోసం, ఆధిపత్యాన్ని నిరూపించుకోవడానికి, రాజకీయ విభేదాలతో.. వైసీపీ నాయకులు హత్యలు, దాడులు, అఘాయిత్యాలకు పాల్పడ్డారు. స్పష్టమైన ఆధారాలున్నా చాలా ఘటనలపై పోలీసులు కేసులు కూడా పెట్టలేదు. ఒకవేళ కేసులు నమోదు చేసినా.. కీలక నిందితులను చేర్చలేదు. నమోదైన కేసుల్లో చాలావరకూ కొలిక్కి వచ్చిన దాఖలాలు లేవు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- మంత్రి కాకాణి "కోర్టులో సాక్ష్యాల చోరీ" కేసు.. సీబీఐ కి అప్పగింత
NELLORE COURT THEFT CASE HANDOVER TO CBI : మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి నిందితుడిగా ఉన్న కేసులో నేర ఆధారాలు నెల్లూరు కోర్టు నుంచి చోరీ అయిన కేసు దర్యాప్తును.. హైకోర్టు సీబీఐకి అప్పగించింది. ప్రత్యేక కోర్టులు ఏర్పాటుచేసి ప్రజాప్రతినిధుల కేసులను త్వరితగతిన విచారించాలని, వాటిని హైకోర్టులు పర్యవేక్షించాలని సుప్రీంకోర్టు స్పష్టంచేసిందని గుర్తుచేసింది. సీబీఐ విచారణను స్వాగతిస్తున్నట్లు మంత్రి కాకాణి తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'పైలట్ విశ్వాత ఘాతకుడు.. ఎప్పటికీ సీఎం కాలేరు'.. రాజస్థాన్ సీఎం సంచలన వ్యాఖ్యలు
Ashok Gehlot On Sachin Pilot : రాజస్థాన్‌లోని కాంగ్రెస్ పార్టీలో రాజకీయ సంక్షోభం మరింత ముదురుతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్.. ఆ పార్టీ కీలక నేత సచిన్ పైలట్‌పై విమర్శలు గుప్పించారు. సచిన్ పైలట్‌ను విశ్వాస ఘాతకుడిగా విమర్శించారు. 2020లో సొంత ప్రభుత్వాన్నే పడగొట్టేందుకు సచిన్ పైలట్ ప్రయత్నించారని మండిపడ్డారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- సుప్రీం నోట పదేపదే శేషన్.. విశేషన్.. సెన్సేషన్.. ఎవరాయన?
TN Seshan Biography : టి.ఎన్.శేషన్‌లాంటి వ్యక్తిత్వం ఉన్నవాళ్లు ఎన్నికల కమిషనర్‌గా రావాలి.. అని సుప్రీంకోర్టు ఇటీవల కీలక వ్యాఖ్యలు చేసింది. శేషన్‌లాంటివాళ్లు ఎప్పుడో ఒకసారిగాని కన్పించరని ఎన్నికల నియామకాలపై విచారణ సందర్భంగా సుప్రీం వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో టి.ఎన్.శేషన్ గొప్పతనం గురించి ఓ సారి తెలుసుకుందాం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- మలేసియా ప్రధానిగా అన్వర్ ఇబ్రహీం.. హంగ్ ఏర్పడినా..
Malaysia New Prime Minister : మలేసియా ప్రధానమంత్రిగా అన్వర్ ఇబ్రహీం ఎన్నికయ్యారు. ఆయనతో మలేసియా రాజు అల్ సుల్తాన్ అబ్దుల్లా ప్రమాణ స్వీకారం చేయించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- మదుపు రూ.లక్ష.. నష్టం రూ.75 వేలు.. దశాబ్దంలోనే అధ్వాన IPOగా పేటీఎం
పేటీఎం అంతర్జాతీయంగా లిస్ట్ అయిన తొలి ఏడాదిలో అత్యంత అధ్వాన పనితీరు ప్రదర్శించిన ఐపీఓల్లో స్పెయిన్‌కు చెందిన బ్యాంకియా తర్వాతి స్థానంలో నిలిచిందని బ్లూమ్‌బర్గ్ విశ్లేషించింది. టెక్ అంకుర సంస్థలు ఐపీఓ విపణిలో ఓ వెలుగు వెలుగుతున్న సమయంలో వచ్చిన పేటీఎం కూడా అదే తీరును ప్రదర్శిస్తుందని అంతా అనుకున్నారు. అయితే అలా జరగలేదు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'టీమ్ సెలక్షన్ గురించి అస్సలు ఆలోచించను.. కేవలం అద్భుతంగా ఆడడమే నా పని'
ప్రపంచజట్టులో స్థానం సంపాదించ లేకపోవడంపై టీమ్ఇండియా క్రికెటర్ వెంకటేశ్ అయ్యర్ తాజాగా స్పందించాడు. ఎప్పటికైనా జట్టులో చేరి ఉత్తమ ప్రదర్శన చేస్తానని ఆశాభావం వ్యక్తం చేశాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. 10 మంది దుర్మరణం
చైనాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఓ అపార్ట్మెంట్లో చెలరేగిన మంటల వల్ల 10 మంది మరణించగా.. మరో 9 మంది గాయపడ్డారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఇయర్‌ఫోన్లు పెట్టుకుని హై వాల్యూమ్‌లో వింటున్నారా? అయితే జాగ్రత్త పడాల్సిందే!
ఇయర్‌ఫోన్లు పెట్టుకుని హై వాల్యూమ్‌తో పాటలు వింటున్నారా? అయితే కాస్త జాగ్రత్త పడాల్సిందే. ఇలా వినడం ద్వారా చెవులు దెబ్బతింటాయంటున్నారు నిపుణులు. వాల్యూమ్ విషయంలో దృష్టి సారించాలని పరిశోధకులు సూచిస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.