ETV Bharat / state

బకాయి వేతనాలు కోరుతూ.. పారిశుద్ధ్య కార్మికుల ఆందోళన

కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికులకు బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేసింది. విశాఖలోని ప్రభుత్వ ఘోషా ఆసుపత్రి ఎదుట కార్మికులు ధర్నా చేపట్టారు.

contract sanitation workers protest
విశాఖలోని ప్రభుత్వ ఘోషా ఆసుపత్రి ఎదుట కార్మికులు ధర్నా
author img

By

Published : Apr 7, 2021, 4:14 PM IST

జీతాలు చెల్లించండి మహా ప్రభో అంటూ విశాఖలోని ఘోషా ఆసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికులు ఆందోళన చేపట్టారు. ఆస్పత్రి ఎదుట ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ధర్నా చేపట్టింది. ఐదు నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో తమ పరిస్థితి దయానీయంగా మారిందని యూనియన్ ప్రధాన కార్యదర్శి జెడీ నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.

కొవిడ్ విపత్కర పరిస్థితుల్లోనూ ప్రాణాలకు తెగించి పని చేస్తున్న తమకు జీతాలు కూడా ఇవ్వకపోవడం సమంజసం కాదని వాపోయారు. వెంటనే జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

ఇదీ చూడండి:

రూ.3099 చెల్లిస్తే... రెండు బట్టల సబ్బులు ఇచ్చారు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.