బూటకపు ఎన్కౌంటర్పై విశాఖ సివిల్ లిబర్టీస్ యూనియన్ అధ్యక్షులు అక్బర్ వేసిన పిటిషన్పై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. మావోయిస్టుల కూంబింగ్ పేరుతో ఇద్దరు అమాయక గిరిజనులను 2012లో పోలీసులు కాల్చిచంపారని, బాధ్యులైన వారిపై హత్యానేరం కింద కేసు నమోదు చేయాలని కోరుతూ అదే ఏడాది వేసిన పిటిషన్ను మరోసారి హైకోర్టు విచారించింది.
విశాఖ ఎన్కౌంటర్, పిటిషనర్ల విశ్వసనీయతపై అవసరమైతే ఎన్ఐఏతో విచారణ చేయిస్తామని హైకోర్టు వ్యాఖ్యానించింది. పోలీసులను ఇబ్బంది పెట్టేందుకు పిటిషన్ దాఖలు చేశారా? లేక నిజంగా బూటకపు ఎన్కౌంటర్ అని వేశారా అనే అంశంపై విచారిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. అనంతరం తదుపరి విచారణను ఈనెల 28కి వాయిదా వేసింది.
ఇదీచదవండి